మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆరోగ్యం న్యూస్

గర్భిణులు ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే ఎంతో మేలు!

Updated: 13-02-2017 02:43:11

ఆహారం.. శరీరానికి కావాల్సిన జవసత్వాలు అందించి మనిషిని ఎల్లప్పుడూ ఉత్సాహంగా, బలంగా ఉంచడంలో తనవంతు పాత్ర పోషిస్తుంది. అయితే సాధారణ  సమయంలో ఎటువంటి ఆహారం తీసుకున్నా పోషకాలు కాస్త, ఎక్కువ తక్కువ అయినా శరీరంపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. అయితే మహిళలు గర్భం సమయంలో తీసుకునే ఆహారం సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం పుట్టబోయే బిడ్డ ప్రమాదంలో పడుతుంది. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో విటమిన్ల తగినన్ని అవసరం. అవి శరీరానికి సరిపడా అందడం వల్ల బిడ్డకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గర్భంతో ఉన్నవారు తీసుకోవాల్సిన విటమిన్లు ఏమిటో చూద్దాం..
 
 విటమిన్ సి: పుట్టబోయే బిడ్డ ఆరోగ్య వృద్ధికి ఇది ఎంతో అవసరం. రోగనిరోధక శక్తి పెంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారంలోని ఐరన్‌ను గర్భస్థ శిశువుకు అందించడంలో సాయపడుతుంది.  
 
లోపాలను నివారించే ఫోలిక్ యాసిడ్: రక్త కణాల అభివృద్ధికి దోహదం చేసే ఫోలిక్ యాసిడ్ పుట్టబోయే బిడ్డలు ఏవైనా లోపాలు ఉంటే సరిచేస్తుంది. గర్భ నిర్ధారణ తర్వాత 12 వారాల వరకు ఫోలిక్ యాసిడ్ విరివిగా లభ్యమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవడం శ్రేయస్కరం.  
 
కొత్త కణాల నిర్మాణానికి విటమిన్ బి12: గర్భస్థ శిశువు నాడీ వ్యవస్థపై విటమిన్ బి12 అనుకూల ప్రభావం చూపుతుంది. బిడ్డ శరీరంలో కొత్త కణాలు ఏర్పాడడానికి ఎంతో ఉపకరిస్తుంది.  
 
ఎముకల  పటుత్వానికి విటమిన్ డి: గర్భం ధరించిన తొలి రోజుల్లో శరీరానికి విటమిన్ డి ఎంత అందితే బిడ్డకు అంత మంచిది. గర్భిణులు రోజూ ఉదయాన్నే కాసేపు వాకింగ్ చేయడం ద్వారా శరీరానికి తగినంత డి విటమిన్ అందేలా చూసుకోవచ్చు. ఎముకల పటుత్వానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది.  
 
అనీమియాను నిరోధించే ఐరన్: గర్భిణులకు తప్పకుండా అందాల్సిన వాటిలో ఐరన్ ఒకటి. ఇది రక్త కణాల లోపాన్ని తగ్గించడంతోపాటు అనీమియాను నిరోధిస్తుంది. 
 
 నరాల పనితీరును మెరుగుపరిచే కాల్షియం: గర్భిణుల శరీరానికి ఇది ఎంతో అవసరం. ఎముకల నిర్మాణంలో, అవయవాల పనితీరులో కాల్షియం చేసే సాయం అంతాఇంతా కాదు. గుండె, నరాల పనితీరును కూడా ఇది మెరుగుపరుస్తుంది.  
 
శరీరానికి హాని చేసే విటమిన్ ఎ: అవును.. గర్భిణులు దీనికి ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. విటమిన్ ఎ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల శరీరానికి హాని జరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  కాబట్టి ఈ సప్లిమెంట్లకు వీలైనంత దూరంగా ఉండడం శ్రేయస్కరం. 

షేర్ :

మరిన్ని ఆరోగ్యం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.