మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆధ్యాత్మికం న్యూస్

01-04-2018 నుండి 07-04-2018 వరకు వారఫలాలు

Updated: 03-04-2018 09:58:20

మేషరాశి :  ఈవారంలో మిత్రులను కలుస్తారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మిత్రులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది . వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు, ఉన్నతమైన ఫలితాలు  అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేసే ప్రయత్నం చేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత గోప్యత కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. స్త్రీ పరమైన విషయాల్లో లేక స్త్రీ లతో కలిసి చేసే పనుల విషయంలో కాస్త నిదానంగా వ్యవహరించుట సూచన. మీ ఆలోచనలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.
 
వృషభరాశి : ఈవారంలో చర్చలకు సమయం ఇస్తారు. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. తండ్రితరుపు బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. సోదరులతో చేపట్టిన చర్చలు ఆశించిన మేర ఫలితాలను ఇస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేసే ఆలోచనను వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు, వైద్యపరమైన సేవలను పొందు ప్రయత్నం మంచిది. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు.
 
మిథునరాశి: ఈవారంలో కుటుంబంలో పెద్దలతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంబంలో నిర్ణయాలు తీసుకొనే విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. కాస్త అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే ఆస్కారం ఉంది , తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. మీ మాటతీరు మూలాన నూతన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో బాగానే ఉంటుంది , ఆర్థికపరమైన పోరోగతిని కలిగి ఉంటారు. ఉద్యోగంలో ఆశించిన విధంగా నూతన అవకాశాలు లభిస్తాయి. సంతానం వలన పెద్దలనుండి ప్రశంశలు పొందుతారు. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు.
 
కర్కాటకరాశి :ఈవారంలో ఉద్యోగంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమాయానికి పూర్తిచేసే అవకాశం కలదు. గతంలో మీకున్న పరిచయాలు మరింతగా మీకు ఉపయోగపడుతాయి. అనుకోకుండా చేసే ప్రయాణాలు లబ్దిని చేకూరుస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడులు లభిస్తాయి. జీవితభాగస్వామితో కలిసి సమయాన్ని గడుపుతారు, కుటుంబంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీయాన ప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. మిత్రులతో కలిసి వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంది , కాస్త ప్రణాళిక కలిగి ఉంటె మరింతగా బాగాఉంటుంది.
 
సింహరాశి : ఈవారంలో సోదరులతో కలిసి చర్చల్లో పాల్గొంటారు, మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేస్తారు. కుటుంబపరమైన విషయాల్లో ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. మిత్రులతో అనుకోకుండా మనస్పర్థలు ఏర్పాడే ఆస్కారం ఉంది, కాస్త ఈ విషయంలో నిదానంగా వ్యవహరించుట సూచన. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. కాస్త ఆలోచించి ముందుకు వెళ్ళండి మేలు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన.
 
కన్యారాశి : ఈవారంలో చిన్న చిన్న విషయాలకు అధికప్రాధాన్యం ఇవ్వడం సూచన. మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేయడం మంచిది. వారికి అనుగుణంగా నడుచుకొనుట మంచిది. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. నూతన వాహనాల విషయంలో ఆలోచన చేస్తారు. సంతానపరమైన విషయాల్లో కొంత ఒత్తిడి తప్పక పోవచ్చును. నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు కలిసి వస్తాయి. మిత్రులతో కలిసి కీలకమైన ఆలోచనలు చేస్తారు, ఆదిశగా అడుగులు ముందుకు వేస్తారు. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలకు అనుకూలమైన సమయం , ప్రయత్నం పెంచుట ఉత్తమం.
 
తులారాశి: ఈవారంలో పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. కుటుంబసభ్యుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది . జీవిత భాగస్వామితో విభేదాలు పెరుగుతాయి. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడుల వచ్చుటకు ఆస్కారం కలదు. కొంత మీ ఆలోచనల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మరింతగా మేలుజరుగుతుంది. తండ్రితరుపు బంధువుల ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. తలపెట్టిన పనులను పూర్తిచేయుటలో కొంత ఇబ్బందులు కలిగిన చివరకు వాటిని పూర్తిచేస్తారు. ఉద్యోగంలో ఒత్తిడిని కలిగి ఉంటారు. మానసికంగా ఇబ్బందులు తప్పక పోవచ్చును. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది.
 
వృశ్చికరాశి : ఈవారంలో బంధువులను కలుస్తారు, వారితో కలిసి నూతన పనులను మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో సమయం గడుపుతారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. కుటుంబ[పరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. అనుకోకుండా చేసే  పరిచయాలకు అవకాశం ఇస్తాయి. సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. వాతావరణంలో వచ్చిన మార్పుల మూలాన అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది, జాగ్రత్త. మీ మాటతీరు మూలం మిత్రులతో విభేదాలు ఏర్పడే ఆస్కారం ఉంది, అలాగే కొంతమందికి నచ్చకపోవచ్చును. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. 
 
ధనస్సురాశి: ఈవారంలో ఉద్యోగంలో మీ ఆలోచనలను అధికారులకు తెలియజేస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. సంతానపరమైన విషయాల్లో మీ  ఆలోచనలకు అనుగుణంగా ముందుకు తీసుకువెళ్ళు ప్రయత్నం చేయుట సూచన. విలువైన వస్తువులను నస్టపోయే అవకాశం కలదు.ఏమాత్రం అశ్రద్దగా ఉన్న మరింతగా నస్టపోయే ఆస్కారము కలదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ద వహించుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది , వారినుండి ఆర్థికపరమైన సహకారం లభిస్తుంది. మిత్రులతో కలిసి సమయం గడుపుతారు.  
 
మకరరాశి : ఈవారంలో చేపట్టిన పనులను పూర్తిచేయుటకు కాస్త సమయం పడుతుంది. ఉద్యోగంలో అధికారుల నుండి పనిఒత్తిడి ఉంటుంది. ప్రణాళిక కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. సోదరుల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. కుటుంబంలో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. మిత్రులతో సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. మానసికంగా దైర్యంగా ఉండుట సూచన. జీవితభాగస్వమిటో కలిసి విహారయాత్రలకు వెళ్లే ఆస్కారం ఉంది. వాహనాల వలన ఇబ్బందులు లేక ప్రమాదాలు ఏర్పడే అవకాశము ఉంది , కావున కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. గతంలో మీకున్న పరిచయాలు తిరి స్నేహం పెంచుకుంటాయి.
 
కుంభరాశి : ఈవారంలో చేపట్టిన పనులను మధ్యలో వదిలేసే అవకాశం ఉంది. స్పష్టమైన ప్రణాళిక కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. మీ ఆలోచనల మూలన పెద్దాలనుండి ప్రశంశలు పొందుతారు. స్త్రీ పరమైన విషయాల వలన మాటపడవల్సి వస్తుంది. కుటుంబంలో మనస్పర్థలు ఏర్పడే ఆస్కారం ఉంది , మీరు మౌనంగా ఉండుట వలన వాటిని అధిగమించే ఆస్కారం కలదు. విదేశీ ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడే ఆస్కారం ఉంది, ఈ విషయంలో కాస్త ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
 
మీనరాశి : ఈవారంలో మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేస్తారు. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యం అయినను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. మీకున్న పరిచయాల మూలాన నూతన అవకాశాలు పొందుతారు. మీ ఆలోచనల్లో నూతన మార్పులకు ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో తగిన విధంగా గుర్తుపు లభిస్తుంది. ప్రమోషన్ లేక ఆశించిన బదిలీ లభిస్తుంది. రావలిసిన ధనంచేతికి అందుతుంది. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. వయపరమలో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. విదేశాల్లో లేక దూరప్రదేశంలో ఉన్న మిత్రులనుండి  ఆర్థికపరమైన సహకారం లభిస్తుంది.
 
 
 
 
డా. టి. శ్రీకాంత్ 
వాగ్దేవిజ్యోతిషాలయం 
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
www.janmalagna.com
9989647466
8985203559
 

షేర్ :

మరిన్ని ఆధ్యాత్మికం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.