మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆధ్యాత్మికం న్యూస్

సుపథం ద్వారా ఐదేళ్లలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం

Updated: 21-07-2017 07:41:35

తిరుమలలో బుధవారం సుపథం ప్రవేశమార్గం గుండా ఐదేళ్లలోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం కల్పించారు. సుపథం మార్గం ద్వారా ఒక సంవత్సరంలోపు వయసున్న చంటిపిల్లలు, వారి తల్లిదండ్రులను దర్శనానికి అనుమతిస్తున్న విషయం విదితమే. అయితే, ఐదేళ్ల వయసు వరకు గల పిల్లలను, వారి తల్లిదండ్రులను సుపథం ద్వారా అనుమతించాలని ఇటీవల పలువురు భక్తులు కోరారు.
 
భక్తుల కోరిక మేరకు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జూలై 19, 26వ తేదీల్లో ఐదేళ్లలోపు పిల్లలను, వారి తల్లిదండ్రులను సుపథం ప్రవేశం ద్వారా దర్శనానికి అనుమతించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు మొత్తం 327 మంది పిల్లలకు టోకెన్లు జారీ చేయగా వారి తల్లిదండ్రులతో కలిసి 627 మంది శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 
 

షేర్ :

మరిన్ని ఆధ్యాత్మికం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.