మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆధ్యాత్మికం న్యూస్

15-04-2018 నుండి 21-04-2018 వరకు వారఫలాలు

Updated: 15-04-2018 12:25:35

మేషరాశి :  ఈవారం ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం సూచన. అధికారులను కలుస్తారు, వారితో కలిసి సమయాన్ని నూతన ప్రయత్నాలను మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో అధికారులకు మీ సూచనలను తెలియజేయుట మంచిది. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. అనుకోకుండా విదేశీప్రయాణాలు వాయిదాపడుతాయి. చేపట్టు పనుల విషయంలో స్పష్టత ఉండుట వలన మేలుజరుగుతుంది. మానసికంగా దృడంగా ఉండుట వలన ఇబ్బందులను ఎదుర్కోగలుగుతారు.
 
వృషభరాశి : ఈవారం ఆత్మీయులను లేక బంధువులను కలిసే అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. చర్చల్లో పాల్గొనే ముందు స్పష్టమైన అవగహన కలిగి ఉండుట మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో స్పష్టమైన ఆలోచన కలిగి ఉండుట మంచిది. ఆర్థికపరమైన విషయంలో అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. వాహనాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. మిత్రులతో మీ ఆలోచనలను పంచుకుంటారు, ముఖ్యమైన నిర్ణయాల విషయంలో నిదానం అవసరం.
 
మిథునరాశి:  ఈవారం ఉద్యోగంలో చేపట్టిన నూతన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి , సాధ్యమైనంత మేర చర్చలకు దూరంగా ఉండుట సూచన. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. మిత్రులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. బంధువులను కలుస్తారు , వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుటకు అవకాశం ఉంది.
 
కర్కాటకరాశి : ఈవారం మీ ఆలోచనల్లో మొండితనం ఉండుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. కుటుంబంలో పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మిత్రులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. సాధ్యమైనంత మేర నూతన ప్రయత్నాలు చేయుటకు ముందు స్పస్టమయిన అవగాహన కలిగి ఉండుట అవసరం. విదేశీప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. జీవితభాగస్వామితో చిన్న చిన్న మనస్పర్థలకు ఆస్కారం ఉన్నది, జాగ్రత్త.
 
సింహరాశి : ఈవారం చర్చలకు అవకాశం ఉంది , సమయాన్ని ఎక్కువ భాగం కేటయించే అవకాశం ఉంది. సోదరులతో చేపట్టిన చర్చలు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. తండ్రితరుపు బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. సంతానపరమైన విషయాల్లో ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. రుణపరమైన సమస్యలు మిమల్ని ఇబ్బందికి గురిచేసే ఆస్కారం ఉంది. దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు, శాతంగా ఉండే ప్రయత్నం చేయుట వలన తప్పక మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేస్తారు.
 
కన్యారాశి : ఈవారం పెద్దలను కలుస్తారు, చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేయుటకు ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు, గతంలో మీకు రావాల్సిన ధనం చేతికి అందుతాయి. వారం మధ్యలో కాస్త ఒత్తిడికి గురయ్యే ఆస్కారం ఉంది. నిదానంగా వ్యవహరించుట సూచన. మీ ఆలోచనలు లేక మాటలు పెద్దలకు సంతృప్తినిస్తాయి. వ్యాపారపరమైన విషయంలో నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. బంధువులను కలుస్తారు, వారినుండి నూతన విషయాలు తెలిసే ఆస్కారం కలదు.
 
తులారాశి: ఈవారం మీ ఆలోచనలను మిత్రులతో లేక పెద్దలతో తెలియజేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో స్పష్టత ఉండుట వలన తప్పక మేలుజరుగుతుంది. సోదరులతో చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది, అవి మధ్యలో ఆగిపోయే ఆస్కారం ఉంది. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు చేపడుతారు. ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. కుటుంబంలో పెద్దలతో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు ఆస్కారం కలదు.
 
వృశ్చికరాశి : ఈవారం సాధ్యమైనంత మేర అనవసరమైన ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయుట సూచన. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా నైనా పూర్తిచేసే అవకాశం ఉంది. మీ మాటతీరు మూలాన నూతన వివాదాలు వచ్చే ఆస్కారం ఉంది. చర్చలు మధ్యలో ఆగిపోయే ఆస్కారం ఉంది. పెద్దలతో లేక అధికారులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు మధ్యలో ఆగిపోయే ఆస్కారం ఉంది. ఉద్యోగంలో సమయపాలన పాటించుట వలన తప్పక మేలుజరుగుతుంది, పనిచేయుట ద్వారా ఫలితాలు పొందుతారు.
 
ధనస్సురాశి: ఈవారం స్థిరాస్తులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. సోదరులతో లేక మిత్రులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. మీ మాటతీరు మూలన నూతన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. పెద్దలను కలుస్తారు, వారినుండి సహకారం పొందుతారు. సహకారం కోసం చేసిన ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. గతంలో మీరు ఇచ్చిన రుణాలు తిరిగిరావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు.
 
మకరరాశి : ఈవారం స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. వాహనాల వలన ఇబ్బందులు ఏర్పడే ఆస్కారం కలదు. ఉద్యోగంలో తలపెట్టిన నూతన ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన ఆలోచనల దిశగా ముందుకు వెళ్తారు. విలువైన వస్తువుల విషయంలో నూతన ఆలోచనలు చేస్తారు, అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. మానసికంగా దృడంగా ఉండుట వలన తప్పక మేలుజరుగుతుంది, సాధ్యమైనంత మేర నిదానంగా ఉండుట సూచన.
 
కుంభరాశి : ఈవారం ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్లకండి. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే ఆస్కారం ఉంది. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబంలో జీవితభాగస్వామితో మనస్పర్థలు ఏర్పడుటకు ఆస్కారం ఉంది, కాస్త నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది.
 
మీనరాశి : ఈవారం మిత్రులతో కలిసి నూతన పనులను మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకు సైతం ప్రాముఖ్యత ఇవ్వడం సూచన. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు, స్పష్టమైన ఆలోచన కలిగి ఉంటారు. తండ్రితరుపు బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. చర్చలకు అవకాశం ఇవ్వకండి.
 
 
 
 
డా. టి. శ్రీకాంత్ 
వాగ్దేవిజ్యోతిషాలయం 
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
www.janmalagna.com
9989647466
8985203559

షేర్ :

మరిన్ని ఆధ్యాత్మికం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.