మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆధ్యాత్మికం న్యూస్

చంద్రగ్రహణం కారణంగా టిటిడి స్థానికాలయాల మూత

Updated: 08-08-2017 10:54:38

చంద్రగ్రహణం కారణంగా సోమవారం సాయంత్రం తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని టిటిడి స్థానికాలయాల తలుపులు మూసివేశారు. తిరిగి మంగళవారం ఉదయం ఆలయాల తలుపులు తెరిచి శుద్ధి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
 
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సాయంత్రం 4.30 గంటలకు మూసివేశారు. ఆగస్టు 8వ తేదీ మంగళవారం ఉదయం 4 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఉదయం 7.30 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.
 
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని సాయంత్రం 4.30 గంటలకు మూసివేశారు. ఆగస్టు 8వ తేదీ మంగళవారం ఉదయం 5 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఉదయం 6.30 గంటలకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయాన్ని సోమవారం సాయంత్రం 4.30 గంటలకు మూసివేశారు. మంగళవారం ఉదయం 5.30 గంటలకు ఆలయాన్ని తెరిచి శుద్ధి అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
 
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయాన్ని సాయంత్రం 4.30 గంటలకు మూసివేశారు. ఆగస్టు 8వ తేదీ మంగళవారం ఉదయం 4 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.
 
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని సాయంత్రం 4.30 గంటలకు మూసివేశారు. ఆగస్టు 8వ తేదీ మంగళవారం ఉదయం 5 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఉదయం 8 గంటలకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
 
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయాన్ని సాయంత్రం 4.30 గంటలకు మూసివేశారు. ఆగస్టు 8వ తేదీ మంగళవారం ఉదయం 4 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి అనంతరం ఉదయం 6 గంటలకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
 
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని సాయంత్రం 4.30 గంటలకు మూసివేశారు. ఆగస్టు 8వ తేదీ మంగళవారం ఉదయం 4.30 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఉదయం 7 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.
 
-----------------------
 
ఆగస్టు 16న అనంతవరంలోని శ్రీవారి ఆలయంలో 
 
బియ్యం, పప్పుదినుసులకు టెండర్‌ కమ్‌ వేలం
 
టిటిడికి అనుబంధంగా ఉన్న గుంటూరు జిల్లా అనంతవరంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో భక్తులు సమర్పించిన బియ్యం, పప్పుదినుసులు, బెల్లం, చక్కెర, చింతపండుకు ఆగస్టు 16వ తేదీన టెండర్‌ కమ్‌ వేలం నిర్వహించనున్నారు.
 
ఆసక్తి గలవారు రూ.100/- డిడి తీసి ఆలయ కార్యాలయ పనివేళల్లో టెండరు షెడ్యూల్‌ పొందవచ్చు. ఆగస్టు 16వ తేదీ సాయంత్రం 3 గంటలలోపు టెండర్లను సమర్పించాల్సి ఉంటుంది. అదేరోజు సాయంత్రం 3.30 గంటలకు టెండర్లను తెరుస్తారు.

షేర్ :

మరిన్ని ఆధ్యాత్మికం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.