భద్రాద్రి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు
Updated:
02-12-2017 08:47:57
భద్రాద్రి: డిసెంబర్ 19 నుంచి జనవరి 8 వరకు భద్రాద్రి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు ఆవిష్కరించారు. డిసెంబర్ 28 తెప్పోత్సవం, డిసెంబర్ 29 ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల తెలిపారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు భద్రాద్రికి తరలిరానున్నారని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.