మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆధ్యాత్మికం న్యూస్

07-01-2018 నుండి 13-01-2018 వరకు వారఫలాలు

Updated: 10-01-2018 02:37:06

మేషరాశి :   ఈవారం మిత్రులతో కలిసి సమయాన్ని గడుపుతారు. ముఖ్యమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాల దిశగా అడుగులు పడుతాయి. జీవితభాగస్వామితో చర్చలకు అవకాశం ఉంది. కుటుంబపెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మేలు. ఆరోగ్యం విషయంలో కొంత జాగరూకత అవసరం, స్వల్ప ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి, నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. తండ్రితరుపు బంధువులలో ఒకరి ఆరోగ్యం విషయంలో ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. పెద్దలనుండి నూతన అవకాశాలు పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది.  
 
వృషభరాశి : ఈవారం సంతానపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో అనుభజ్ఞుల సూచనలను పరిగణలోకి తీసుకుంటారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులు లభిస్తాయి. ఆర్థికపరంగా కొంత అభివృద్ధిని పొందుతారు. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం కలదు. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఉద్యోగంలో లేక వృత్తిస్థానంలో పనిఒత్తిడి ఉంటుంది. కాస్త ప్రణాళిక కలిగివుండి ముందుకు వెళ్ళుట సూచన. నూతన ఉద్యోగప్రయత్నాలు చేయకపోవడం సూచన. దైవపరమైన విషయాలకు కాస్త సమయం ఇవ్వడం మంచిది. కాస్తప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. ఎవ్వరితోను మాట పట్టింపులకు వెళ్ళకండి.
 
మిథునరాశి: ఈవారం అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది, పెద్దగా ప్రయాణాలు అనుకూలించకపోవచ్చును. కుటుంబంలో కీలకమైన చర్చలకు అవకాశం ఉంది, మీ ఆలోచనలు పంచుకోండి. సభ్యులనుండి వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకోండి. మీ మాటతీరు కొంతమందికి ఇబ్బందిని కలిగించేదిగా ఉంటుంది ,ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. ఉద్యోగంలో సమయానుకూలంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో సొంతనిర్ణయాలు కలిగి ఉండాలి, వాటితోపాటు అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఋణం విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించుట సూచన. సంతానం వలన మంచి గుర్తింపును పొందుతారు. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది.
 
కర్కాటకరాశి : ఈవారం చిన్న చిన్న విషయాలకు అధికంగా ప్రాధాన్యం ఇస్తారు. ఉద్యోగంలో మీరు చేపట్టిన పనులకు ఆశించిన మేర ఫలితాలు వస్తాయి. మీరు మీ అనేభావాన్ని కొద్దిగా పక్కపెట్టుట వలన నష్టాన్ని తగ్గించుకొనే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు తగినవిధంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సోదరులతో నూతన చర్చలకు అవకాశం ఉంది. విహారయాత్రలకు వెళ్ళుటకు అవకాశం కలదు. కుటుంబంలో సంతోషకరమైన వార్తను వింటారు. గతంలో మీరు ఇచ్చిన రుణాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది, కాస్త ఆలోచన తో ముందుకు వెళ్ళుట సూచన. జీవితభాగస్వామి నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.
 
సింహరాశి : ఈవారం నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. సంతానం గురుంచి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. వారికి సమయం ఇవ్వడం సూచన. ప్రయాణాలు చేయునపుడు నూతన పరిచయాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు, నూతన పనులకు సంభందించి ఒప్పందాలు చేసే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీఉస్కోనే విషయంలో కాస్త తడబాటును పొందుతారు. సమయానికి భోజనం చేయుట సూచన. అప్పుల విషయంలో కాస్త నిదానంగా వ్యవహరించుట మేలు. వ్యాపారంలో కాస్త నిగ్రహం అవసరం. చిన్న చిన్న పనులకు ప్రాధాన్యం ఇవ్వడం వలన లబ్దిని పొందుతారు.
 
కన్యారాశి : ఈవారం సమయాన్ని సరదాగా గడుపడానికే ఇష్టపడుతారు. కుటుంబసభ్యులతో సమయం గడుపుతారు. సభ్యులతో కలిసి నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీరు చేసిన ప్రయత్నం ఇంకా పెంచుట మంచిది. గతంలో మొదలు పెట్టిన పనులకు గాను ఫలితం వస్తుంది. మీ ఆలోచనల్లో స్పష్టత అవసరం. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. తల్లితరుపు బంధువుల నుండి లేక తల్లినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సంతానం విషయంలో కాస్త ఒత్తిడి పొందుతారు. విదేశీప్రయాణాలు కలిసి వస్తాయి, ప్రయత్నం చేయుట మేలు.
 
తులారాశి: ఈవారం ఆరంభంలో కాస్త ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం ఉంది. సోదరులతో చేపట్టిన చర్చలు పెద్దగా ఉపయోగపడకపోవచ్చును. మీమాటతీరు నూతన సమస్యలకు దారీతీస్తాయి. ఉద్యోగంలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. అనుకోకుండా దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది, పరిచయాల విషయంలో స్పష్టత లేకపోతే నూతన ఇబ్బందులు వస్తాయి, జాగ్రత్త. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం ఆచితూచి వ్యవహరించుట మంచిది. సాధారణంగా చర్చలకు దూరంగా ఉండుట మంచిది. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం కలదు. 
 
వృశ్చికరాశి : ఈవారం ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. బంధువులను కలుస్తారు వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. కొన్ని కొన్ని విషయాల్లో అతిగా స్పందించుట ద్వారా వివాదాలకు కారణం అయ్యే అవకాశం ఉంది , జాగ్రత్త. రావాల్సిన ఆర్థికపరమైన సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ఆస్కారం ఉంది. సోదరులతో చర్చలకు అవకాశం ఇవ్వకండి, విలువైన వస్తువులను నస్టపోయే అవకాశం ఉంది. వాహనాల వలన అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే ఆస్కారం కలదు. మిత్రులను కలుస్తారు, వారితో చర్చలు చేస్తారు.
 
ధనస్సురాశి: ఈవారం ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు, చేపట్టిన పనులకు సమానమైన ఫలితాలు పొందుతారు. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలను అందిపుచ్చుకొనే ప్రయత్నం మంచిది. మీ మాటతీరు విషయంలో కొంతమంది వ్యతిరేకతను ప్రదరిస్తారు, సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా నైనా పూర్తిచేసే ఆస్కారం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట అలాగే అశ్రద్ధ చూపకపోవడం మేలు. పెద్దలతో మీకున్న పరిచయం లబ్దిని కలిగిస్తుంది. దూరప్రదేశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. చిననాటి మిత్రులతో మీ ఆలోచనలను పంచుకుంటారు, సమయం సరదాగా గడుపుతారు. 
 
మకరరాశి : ఈవారం సాధ్యమైనంత మేర చర్చలకు అవకాశం ఇవ్వకండి. వ్యాపారపరమైన విషయాల్లో నిదానంగా ముందుకు వెళ్ళుట సూచన. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది, కుటుంబసభ్యులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. కొన్ని కొన్ని విషయాల్లో మీకు తెలివకుండానే నైరాశ్యం పొందే అవకాశం ఉంది. కావున మానసికంగా దైర్యంగా ఉండే ప్రయత్నం చేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో కాస్త బలపడే అవకాశం ఉంది. జీవితభాగస్వామి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఉద్యోగాల్లో నూతన అవకాశాలు పొందుతారు. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి.
 
కుంభరాశి : ఈవారం ఆరంభంలో కాస్త ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది, ప్రయాణాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును. అవకాశం ఉంటె వాయిదావేయుట సూచన. దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. తలపెట్టిన పనులను మధ్యలో వదిలేసే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అనారోగ్యసమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ఆస్కారం కలదు. మీ పూర్వీకుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. తండ్రితరుపు బంధువులలో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం కలదు.
 
మీనరాశి : ఈవారం మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేసే అవకాశం ఉంది. వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ప్రయాణాలు లభిస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంతానపరమైన విషయాల్లో మీ ఆలోచనలను కుటుంబపెద్దలకు తెలియజేస్తారు. సముద్రప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి పూర్తిస్థాయి సహకారం లభిస్తుంది. వాహనాల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. జీవితభాగస్వామితో అనుకోకుండా స్వల్ప మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. నూతన నిర్ణయాల విషయంలో స్పష్టత అవసరం. నూతన అవకాశాలను అందిపుచ్చుకొనే ప్రయత్నం చేయుట మంచిది. బంధువుల నుండి కీలకమైన విషయాలు తెలుస్తాయి.
 
 
 
 
 
 
 
డా. టి. శ్రీకాంత్ 
వాగ్దేవిజ్యోతిషాలయం 
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
www.janmalagna.com
8985203559

షేర్ :

మరిన్ని ఆధ్యాత్మికం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.