నటుడు బెనర్జీ కుటుంబంలో విషాదం
Updated:
15-04-2018 12:22:00
హైదరాబాద్: నటుడు బెనర్జీ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి రాఘవయ్య కన్నుమూశారు. రాఘవయ్య వయసు 86 సంవత్సరాలు. వీరాంజనేయ, కథానాయకుడు, యమగోల, భరత్ అనే నేను సినిమాల్లో ఆయన నటించారు. ఫిల్మ్ నగర్ సాయిబాబా మందిరం సమీపంలో ఉన్న నివాసంలో రాఘవయ్య భౌతికకాయాన్ని ఉంచారు. ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో మధ్యాహ్నం మూడు గంటలకు అంత్యక్రియలు జరుగుతాయి. పలువురు సినీ ప్రముఖులు బెనర్జీ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.