పవన్‌ను దూషించినందుకు శ్రీరెడ్డిపై శివబాలాజీ ఫిర్యాదు
Updated:
19-04-2018 03:05:30
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను, ఆయన తల్లిని దూషించినందుకు నటుడు శివబాలాజీ రాయదర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. తనతో పాటు లక్షలాది మంది ఆరాధించే పవన్‌ను, ఆయన తల్లిని అకారణంగా దూషించడం ద్వారా తమ సెంటిమెంట్లను దెబ్బ తీశారని శివబాలాజీ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 16వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు తాము టీవీ చూస్తుండగా శ్రీ రెడ్డి పవన్‌ను, ఆయన తల్లిని అకారణంగా దూషించడాన్ని గమనించానని, తన మనోభావాలు దెబ్బతిన్నాయని శివబాలాజీ పేర్కొన్నారు. పవన్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఆమె ప్రవర్తించిందని శివబాలాజీ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజల శాంతికి భంగం కలిగేలా ప్రవర్తించిన శ్రీరెడ్డిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పవన్‌ను ఉద్దేశించి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్మ ప్రోద్భలంతో తాను ఈ వ్యాఖ్యలు చేశానని శ్రీరెడ్డి చెప్పడం, అవును తానే సలహా ఇచ్చానని వర్మ ఇప్పటికే చెప్పడం జరిగింది.