మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తెలంగాణ న్యూస్

పెళ్లి చేసుకోమన్నందుకు హత్య.. సమాధి చేసి పరారీ..

Updated: 06-03-2018 08:13:00

మోత్కూర్: యాదాద్రి జిల్లా మోత్కూర్ మండలం బుజలాపురంలో దారుణం జరిగింది. ప్రియుడు నరేశ్ ప్రియురాలు భార్గవిని హత్య చేసి సమాధి చేశాడు. పెళ్లి చేసుకోమన్నందుకు దారుణంగా హతమార్చి పరారయ్యాడు. తెల్లారితే మరో యువతితో వివాహం జరుగుతుందనగా నరేశ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానంటూ భార్గవిని తన వ్యవసాయ బావి వద్దకు పిలిచిన నరేశ్ ఆమెను కొట్టి చంపేశాడు. ఆ తర్వాత వ్యవసాయ బావి వద్దే పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత మరో యువతిని రెండ్రోజుల క్రితమే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. భార్గవి తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నరేశ్ చేసిన దుర్మార్గం బయటపడింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. 

షేర్ :

మరిన్ని తెలంగాణ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.