మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తెలంగాణ న్యూస్

మూకుమ్మడి రాజీనామా యోచనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు !

Updated: 13-03-2018 11:35:14

హైదరాబాద్: శాసనమండలి చైర్మెన్‌పై మైక్ విసిరిన ఘటనలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ్యత్వం రద్దు చేయడంతో పాటు మరో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ కూడా చేశారు. దీంతో వీరంతా రాజీనామాలకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వీరు రాజీనామాలు చేస్తారని సమాచారం. దీంతో మొత్తం 13 స్థానాలకు ఎన్నికలు ఖాయమని తెలుస్తోంది. దీనికి తోడు స్పీకర్ వద్ద 9 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లు కూడా ఉన్నాయి. వీరిపైన కూడా స్పీకర్ నిర్ణయం తీసుకుంటే త్వరలో 22 స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు హెడ్‌ఫోన్స్ విసిరిన ఘటనలో వీడియో పరిశీలిస్తే మరో ఇద్దరు సభ్యులు కూడా స్పీకర్‌కు కనిపించినట్లు తెలిసింది. దీంతో వీరిని కూడా సస్పెండ్ చేస్తారని తెలుస్తోంది. మండలిలో కూడా షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, ఆకుల లలిత, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను సస్పెండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ సభ్యుల శాసనసభ్యత్వం రద్దు, శాసన సభ్యులపై సస్పెనషన్ వేటు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్రుగా ఉంది. తమపై స్పీకర్ చర్యలకు నిరసనగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ హైదరాబాద్ గాంధీభవన్ వద్ద 48 గంటల దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో కాంగ్రెస్ పార్టీ నేతలంతా పాల్గొన్నారు. 

షేర్ :

మరిన్ని తెలంగాణ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.