ప్రముఖ యాంకర్ రాధిక ఆత్మహత్య
Updated:
02-04-2018 12:24:52
హైదరాబాద్: ప్రముఖ యాంకర్ రాధిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. మూసాపేట్ గూడ్స్‌షెడ్ రోడ్డులోని సుశీల్ అపార్ట్‌మెంట్స్ ఐదో అంతస్థు నుంచి పడి ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. రాధిక వి6 టీవీ ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేస్తోంది. రాధిక ఆత్మహత్య చేసుకుందంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. ముఖ్యంగా వి6 సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులకు ఒక సుసైడ్ నోట్ లభ్యమైంది. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ ఆమె లేఖలో రాసినట్లు సమాచారం.