మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తెలంగాణ న్యూస్

హరిభూషణ్ సహా 12 మంది మావోయిస్టులు హతం

Updated: 02-03-2018 01:30:19

మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ చత్తీస్‌గడ్‌ సరిహద్దులోని బీజాపూర్ జిల్లా పుజారీ కనేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎ‌న్‌కౌంటర్ జరిగింది. 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఎదురుకాల్పుల్లో ఒక గ్రేహౌండ్ కానిస్టేబుల్ అమరుడయ్యారు. తొండపాల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం విషయం తెలుసుకుని కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టులు కాల్పులకు దిగడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. తెలంగాణ, చత్తీస్‌గడ్‌ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. 

షేర్ :

మరిన్ని తెలంగాణ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.