కూకట్‌పల్లిలో పట్టపగలు యువకుడి దారుణ హత్య
Updated:
12-03-2018 01:18:08
హైదరాబాద్: కూకట్‌పల్లిలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. జెఎస్‌పి హోండా షోరూం సమీపంలో ఈ హత్య జరిగింది. పట్ట పగలే ముంబాయ్ హైవేపై వేటకొడవళ్ళతో వచ్చిన ముగ్గురు యువకులు సుధీర్‌ను అడ్డగించారు. ఆ తర్వాత కాళ్ళు చేతులు తెగిపడేట్లుగా సినీ ఫక్కీలో అతిదారుణంగా నరికి చంపారు. వచ్చిన ముగ్గురు కూడా యువకులే అని సమాచారం. హత్య చేసిన వారిలో మహేష్ అనే యువకుడిని కూకట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇంటర్ మీడియట్ చదువుతున్న సుధీర్‌కు ఇవాళ పరీక్ష కూడా ఉందని సమాచారం. పరీక్ష రాసేందుకు వెళ్తుండగా అడ్డగించి అతి కిరాతకంగా చంపినట్లు సమాచారం.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని కూకట్‌పల్లి ఏసీపీ భుజంగరావు తెలిపారు.