Updated: 20-03-2018 09:49:49
కోల్‌కతా: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పశ్చిమ బెంగాల్ సచివాలయంలో సీఎం మమతా బెనర్జీతో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారు. ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ, ఎజెండాపై చర్చించారు. కేసీఆర్ వెంట ఆయన కుమార్తె, టీఆర్ఎస్ ఎంపీ కె.కవిత కూడా ఉన్నారు. కేసీఆర్‌కు మమత స్వయంగా ఘనంగా స్వాగతం పలికారు. చర్చల సందర్భంగా కలిసి నడుద్దామన్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను కలుపుకుపోవాలని ఇద్దరు నేతలూ నిర్ణయించారు. తమది థర్డ్ ఫ్రంట్ కాదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది సమష్టి నాయకత్వంతో పనిచేసేదని కేసీఆర్ చెప్పారు. కోల్‌కతా పర్యటనలో భాగంగా కేసీఆర్ కాళికామాత ఆలయాన్ని సందర్శించారు.
షేర్ :
తాజా వార్తలు