పవన్‌పై మరోమారు విరుచుకుపడిన మహేశ్ కత్తి
Updated:
28-03-2018 07:58:11
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినీ విమర్శకుడు మహేశ్ కత్తి మరోమారు పైరయ్యారు. గతంలో కొన్ని నెలలపాటు పవన్‌పై రోజుకు విమర్శ చేసిన మహేశ్ కత్తి ఆ తర్వాత పవన్ అభిమానులతో కుదిరిన సయోధ్యతో కొన్నాళ్లు మౌనంగా ఉన్నాడు. మళ్లీ గత కొన్ని రోజులుగా పవన్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న కత్తి తాజాగా తీవ్రస్థాయిలో ఫైరయ్యాడు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో పవన్ గళమెత్తినప్పటి నుంచి కత్తి మళ్లీ స్వరం పెంచాడు. పవన్ నోరు తెరిస్తే అజ్ఞానమేనని ట్వీట్ చేశాడు. ‘‘బాబు పవన్ కల్యాణ్.. రాజ్యాంగ సంక్షోభం అనగానేమి? పది మార్కుల ప్రశ్న. సమాధానం చెప్పుడు. చంద్రబాబునాయుడు పార్లమెంటు ముందు నిరసన చేసిన యెడల రాజ్యాంగ సంక్షోభం ఎలా ఏర్పడును? ఉప ప్రశ్న. 5 మార్కులు పూరింపుడు. నోరు తెరిస్తే అజ్ఞానం. అజ్ఞానవాసీ సుఖీభవ!’’ అని ట్వీట్ చేసి మళ్లీ కాకరేపాడు.