కూలిన విమానం.. 32మంది దుర్మరణం
Updated:
06-03-2018 07:40:43
సిరియా: రష్యా విమానం కూలిపోయింది. ఘటనలో 26 మంది ప్రయాణికులు, ఆరుగురు విమాన సిబ్బంది దుర్మరణం పాలయ్యారని సమాచారం. ఘటన సిరియాలోని మైమిమ్ బేస్ వద్ద జరిగింది. సిరియాలో రష్యా సేనలు సిరియా సైన్యానికి అనుకూలంగా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. విమానం కూలిన ఘటనను రష్యా రక్షణ శాఖ ధృవీకరించిందని అంతర్జాతీయ వార్తా సంస్థలు తెలిపాయి. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.