మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       జాతీయం న్యూస్

కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్‌కు బిగ్ షాక్

Updated: 05-04-2018 11:50:26

జోథ్‌పూర్: కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్‌ను దోషిగా తేలుస్తూ జోథ్‌పూర్ కోర్టు తీర్పు చెప్పింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. పదివేల జరిమానా కూడా విధించింది. ఇదే కేసులో టబూ, సొనాలి, సైఫ్ అలీఖాన్, నీలంలను నిర్దోషులుగా ప్రకటించింది. 1998లో హమ్ సాథ్‌హై సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ రెండు కృష్ణ జింకలను వేటాడాడు. 20 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనలో మూడు కేసులు నమోదయ్యాయి. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారనే కేసు నుంచి సల్మాన్ బయటపడ్డాడు. అయితే వేటాడిన కేసులో మాత్రం దోషిగా తేలాడు. కోర్టు తీర్పుతో సల్మాన్ షాక్‌కు గురయ్యాడు. శిక్షలు ప్రకటించిన తర్వాత సల్మాన్‌ను సెంట్రల్ జైలుకు తరలించారు. సల్మాన్ దోషిగా తేలడంతో బాలీవుడ్‌కు కూడా బిగ్ షాక్ తగిలినట్లైంది. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోనున్నాయి. మరోవైపు జోథ్‌పూర్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని సల్మాన్ నిర్ణయించుకున్నారు. 
 

షేర్ :

మరిన్ని జాతీయం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.