మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       జాతీయం న్యూస్

ఏపీ బిజెపి మంత్రుల రాజీనామా?

Updated: 07-03-2018 01:27:11

అమరావతి: ఏపీ బిజెపి మంత్రులు రాజీనామా యోచనలో ఉన్నారు. ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలని ఢిల్లీ నుంచి సమాచారం అందినట్లు తెలిసింది. మరి కాసేపట్లో ఏపీ సిఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. బిజెపితో తెగతెంపులు చేసుకుంటూ చంద్రబాబు ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. సిఎం ప్రకటన వెలువడగానే రాజీనామాలు చేయాలంటూ మంత్రి కామినేనికి ఢిల్లీ నుంచి సమాచారం వచ్చిందని తెలిసింది. ఎంపీ కంభంపాటి హరిబాబుతో ఏపీ బిజెపి నేతలు ఇప్పటికే ఈ విషయంపై చర్చించారు. టిడిపి యాక్షన్‌కు అనుగుణంగా తమ రియాక్షన్ ఉంటుందని కామినేని తెలిపారు. ఏపీ కేబినెట్ నుంచి బిజెపి మంత్రులు రాజీనామా చేయగానే కేంద్రం నుంచి టిడిపి మంత్రులు రాజీనామా చేస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో సిఎం చంద్రబాబు అసెంబ్లీలో చేయబోయే ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

షేర్ :

మరిన్ని జాతీయం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.