మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       జాతీయం న్యూస్

బోనీకపూర్‌‌ను అరెస్ట్ చేసే అవకాశం

Updated: 27-02-2018 10:05:06

దుబాయ్: శ్రీదేవి మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ విషయంలో ఆమె భర్త బోనీకపూర్ చెబుతున్న వివరాలతో సంతృప్తి చెందడం లేదు. ఇప్పటికే ఆయన పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ విడిచి వెళ్లరాదని ఆదేశించారు. నిన్నటి అటాప్సీ రిపోర్ట్‌పై దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బోనీకపూర్‌ను తిరిగి ప్రశ్నించాక శ్రీదేవి రీపోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. శ్రీదేవి శరీరంలో ఆల్కహాల్ ఆనవాళ్లు కూడా ఉండటంతో ఆమె హెల్త్ రికార్డ్ కావాలని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోరింది. ఇప్పటికే శ్రీదేవి ఫోన్ కాల్ డాటా పరిశీలిస్తున్నారు. బోనీ కపూర్ మేనల్లుడు మోహిత్ మార్వా కుటుంబాన్ని కూడా దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రశ్నించనుంది. మొత్తం వ్యవహారంలో బోనీకపూర్ కీలకంగా మారారు. 18 గంటల పాటు దుబాయ్‌ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రశ్నించింది. అయినా కూడా ఆయన నుంచి సంతృప్తికరంగా లేకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అనేక అనుమానాలు వస్తుండటంతో బోనీకపూర్‌ను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని సమాచారం.
 
శ్రీదేవి హోటల్ బాత్‌రూంలో ప్రమాదవశాత్తూ పడిపోయి నీటిలో మునిగి చనిపోయారని ఫోరెన్సిక్ రిపోర్ట్ వెల్లడించింది. దీనికి తోడు శ్రీదేవి శరీరంలో ఆల్కహాల్ ఆనవాళ్లు కూడా కనపడటంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆమెకు మద్యం తాగే అలవాటు లేదని రాజకీయ నేత అమర్‌సింగ్‌ కూడా ఇప్పటికే స్పష్టం చేశారు.
 
ఆర్ధిక కారణాల వల్ల బోనీకి, శ్రీదేవికి గొడవలొచ్చాయనే ప్రచారం జరుగుతోంది. బోనీకపూర్ తన బంధువులతో సన్నిహితంగా ఉండటంపై కూడా భార్యభర్తల మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హోటల్‌లో ఉన్న సిసిటీవీ ఫుటేజ్‌ను దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్వాధీనం చేసుకుంది. నేటి విచారణలో బోనీకపూర్ అందించే వివరాలను బట్టి కేసు మిస్టరీ వీడే అవకాశం ఉంది. 
 
మరోవైపు భారత కాన్సులేట్ అధికారులు శ్రీదేవి భౌతికకాయాన్ని భారత్‌కు రప్పించేందుకు యత్నిస్తున్నారు. అయితే శ్రీదేవి మృతి వెనుక ఉన్న కారణాలపై స్పష్టత వస్తేనే ఆమె భౌతికకాయాన్ని భారత్‌కు అప్పగిస్తారు.

షేర్ :

మరిన్ని జాతీయం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.