పారికర్‌ను పరామర్శించిన మోదీ
Updated:
19-02-2018 12:55:05
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న గోవా సిఎం మనోహర్ పారికర్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరామర్శించారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రికి వెళ్లి పారికర్‌ను పరామర్శించారు. ఫుడ్ పాయిజనింగ్‌తో పారికర్ ఆసుపత్రిలో చేరారు. ఆయన అనారోగ్యంపై పుకార్లు షికారు చేస్తున్న సమయంలో ముంబై లీలావతి ఆసుపత్రి యాజమాన్యం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఆయన కోలుకుంటున్నారని స్పష్టం చేసింది. పుకార్లు నమ్మవద్దని సూచించింది. ముంబైలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఆదివారం దేశ వాణిజ్య రాజధానికి వచ్చారు.