శశికళ భర్త కన్నుమూత
Updated:
20-03-2018 09:17:11
చెన్నై: అన్నాడిఎంకే మాజీ నాయకురాలు శశికళ భర్త నటరాజన్ మారుతప్ప కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. కొంత కాలంగా అనారోగ్యంగా ఉన్న నటరాజన్ గుండెపోటుతో ఇటీవలే చెన్నైలోని గ్లోబల్ హెల్త్ ఆసుపత్రిలో చేరారు. రాత్రి ఒకటిన్నర సమయంలో తుదిశ్వాస విడిచారు. మరోవైపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక పరప్పన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తోన్న శశికళ 15 రోజుల పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తంజావూరులోని స్వగ్రామంలో భర్త అంత్యక్రియలకు ఆమె హాజరవుతారు. నటరాజన్ మరణంతో శశికళ వర్గం కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. డిఎంకే నాయకుడు స్టాలిన్ సహా పలువురు నాయకులు నటరాజన్‌కు నివాళులర్పించారు. జయ మరణానికి ముందు ఓ వెలుగు వెలిగిన శశికళ జయ మరణం తర్వాత జైలు పాలయ్యారు. అది కూడా జయ అక్రమాస్తుల కేసులోనే. ఇప్పుడు భర్తను కూడా కోల్పోయారు.