మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       జాతీయం న్యూస్

త్రిపురలో కమల వికాసం..

Updated: 04-03-2018 12:57:24

అటు లెఫ్ట్.. ఇటు రైట్.. దేశంలో తొలిసారిగా భిన్న సైద్ధాంతిక పార్టీలు నేరుగా తల పడిన ఎన్నికలు ఇవే.. ఇప్పటి వరకు వామపక్షాలు సరైన సిద్ధాంతం లేని వారసత్వ రాజకీయ పార్టీ కాంగ్రెస్ తో మాత్రమే పోటీ పడుతూ వచ్చాయి.. 
 
తొలిసారిగా విదేశీ సిద్ధాంత భావజాలం ఉన్న సీపీఎం, స్వదేశీ జాతీయవాద పార్టీ బీజేపీ హోరాహోరీ పోరాడాయి.. ఈశాన్య భారత దేశంలోని చిన్న రాష్ట్రం త్రిపుర ఇందుకు వేదిక అయింది.. 
 
త్రిపుర అసెంబ్లీకి ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడలేదు.. కానీ తాజా ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడం ద్వారా మార్క్సిస్టుల కంచుకోటను బద్దలు కొట్టింది. కాంగ్రెస్ పై ఎప్పుడో విశ్వాసం పోయిన త్రిపుర ప్రజలు విధిలేని పరిస్థితుల్లో సీపీఎంను భరిస్తూ వచ్చారు.. కానీ అవినీతి, అసమర్థ నిర్వాకంతో ఆ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది..
 
కమ్యూనిస్టులు నిన్న పశ్చిమ బెంగాల్ కోల్పోయారు.. ఇవాళ త్రిపుర కోల్పోయారు.. రేపు కేరళ కూడా కోల్పోవడం ఖాయం.. మరోవైపు త్రిపుర విజయం బీజీపీ ఒక హెచ్చరిక కూడా.. ఆ రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే దేశంలో ఏకైక కమ్యూనిస్టు రాష్ట్రం కేరళ కూడా కైవసం కావడం ఖాయం.
 
క్రాంతిదేవ్ మిత్ర, జర్నలిస్ట్, హైదరాబాద్

షేర్ :

మరిన్ని జాతీయం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.