ఆదిత్యనాథ్‌కు ఎదురుదెబ్బ.. ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి
Updated:
14-03-2018 06:29:54
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గోరఖ్‌పూర్, ఫుల్పుర్ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఉప ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తమ లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఫుల్పుర్ నుంచి కౌశలేంద్రసింగ్ పటేల్, గోరఖ్‌పూర్ నుంచి ఉపేంద్ర దత్ శుక్లాలను బీజేపీ బరిలోకి దించింది. ఈ స్థానాల నుంచి సమాజ్‌వాదీ పార్టీ ప్రవీణ్ నిషాద్, నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్‌లను బరిలోకి దించింది. ఈ రెండు స్థానాలను ఎస్పీ కైవసం చేసుకోగా, కాంగ్రెస్ అభ్యర్థులు సురీథ కరీం, మనీష్ మిశ్రాలకు డిపాజిట్ కూడా దక్కలేదు.