మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       జాతీయం న్యూస్

ఢిల్లీలో కలకలం.. చీఫ్ సెక్రటరీపై ఆప్ ఎమ్మెల్యేల దాడి!

Updated: 20-02-2018 02:21:13

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సిఎం కేజ్రీవాల్ చూస్తుండగానే తనపై దాడి చేశారంటూ ఢిల్లీ చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాశ్ లెఫ్టెనెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. నిన్న సాయంత్రం సిఎం కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి జరుగుతుంటే సిఎం ప్రేక్షకుడిలా చూస్తుండిపోయారని ఆరోపించారు. తనపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అటు అన్షు ప్రకాశ్‌పై దాడి ఘటనను నిరసిస్తూ  సిఎస్‌పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఐఏఎస్ అధికారుల సంఘం ఢిల్లీలో ఆందోళన చేపట్టింది. చీఫ్ సెక్రటరీకే భద్రత లేకపోతే రాష్ట్రంలో ఇంకెవరికి ఉంటుందని ప్రశ్నించింది. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినట్లేనని హెచ్చరించింది. మరోవైపు తమ ఎమ్మెల్యేలు దాడి చేయలేదని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. బిజెపి, కాంగ్రెస్ పార్టీ కూడా ఆప్ ఎమ్మెల్యేల తీరును ఎండగట్టాయి. 

షేర్ :

మరిన్ని జాతీయం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.