శ్రీదేవి తలకు బలమైన గాయాలు.. నేడు రీ పోస్ట్‌మార్టం?
Updated:
27-02-2018 01:18:23
దుబాయ్: శ్రీదేవి తలకు బలమైన గాయాలున్నట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ నివేదికలో ఈ విషయాన్ని బయటపెట్టలేదని సమాచారం. అటు శ్రీదేవి భౌతికకాయం మూడు రోజులుగా దుబాయ్ ఫోరెన్సిక్ మార్చురీలోనే ఉంది. భారత కాన్సులేట్ అధికారి గౌరవ్ కపూర్‌ను తప్ప వేరెవ్వరినీ మార్చురీలోకి అనుమతించడం లేదు. నేడు రీ పోస్ట్‌మార్టం జరిపే అవకాశం ఉంది. దీంతో ఆమె భౌతికకాయం నేడు భారత్‌కు చేరుకోకపోవచ్చని సమాచారం. మరోవైపు శ్రీదేవిపై వంద కోట్ల రూపాయల ఇన్సురెన్స్ ఉందని సమాచారం. ఆస్తిని శ్రీదేవికి బోనీ కపూర్ ద్వారా కలిగిన ఇద్దరు అమ్మాయిలకు(జాన్వీ, ఖుషీ) కాకుండా తొలి భార్య పిల్లలకు అర్జున్ కపూర్, అన్షులా కపూర్‌కు అందించాడని శ్రీదేవికి తెలిసి గొడవ జరిగినట్లు సమాచారం. అటు మేనల్లుడు మోహిత్ వివాహంలో శ్రీదేవిని బోనీకపూర్ బంధువులు ఏకాకిని చేసి అవమానించారని తెలుస్తోంది. అందుకే ఆ అవమానాన్ని తట్టుకోలేక శ్రీదేవి రెండు రోజులుగా హోటల్ రూం నుంచి బయటకు రాలేదని తెలిసింది. ఆ తర్వాత ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు బోనీ కపూర్ సోదరుడు సంజయ్ కపూర్ చెప్పారు. ఫోరెన్సిక్ నివేదికలో మాత్రం ఆమె ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడి నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయినట్లు పేర్కొన్నారు. అయితే దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తిరిగి విచారణ ప్రారంభించింది. బోనీకపూర్‌ను 18 గంటలకు పైగా ప్రశ్నించింది. ఆయన పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుంది. బోనీ కపూర్ బంధువులను కూడా ప్రశ్నిస్తున్నారు. శ్రీదేవి బస చేసిన హోటల్ సిబ్బందిని కూడా ప్రశ్నించారు. జుమైరా ఎమిరేట్స్ హోటల్ గది 2201ను సీజ్ చేశారు. శ్రీదేవి కారు డ్రైవర్‌ను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు దుబాయ్‌కు ఆయన మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్ కూడా దుబాయ్ వెళ్లారు. పూర్తి స్పష్టత వస్తేనే శ్రీదేవి భౌతికకాయాన్ని అప్పగిస్తారు. లేదంటే విచారణ కొనసాగుతుంది.