మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       జాతీయం న్యూస్

వైసీపీతో కలిసి ధర్నాలో పాల్గొన్న మహేశ్ కత్తి

Updated: 05-03-2018 06:17:12

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు నిర్వహించిన ఆందోళనలో సినీ విమర్శకుడు మహేశ్ కత్తి పాల్గొన్నారు. పార్లమెంట్ స్ట్రీట్‌లో జరిగిన ఈ ఆందోళనతో పాల్గొన్న నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పారిశ్రామికంగా ఏపీ ఎంతో అభివృద్ధి సాధించి ఉండేదని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. కేంద్రంతో చంద్రబాబు లాలూచీపడి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మరో ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈనెల 21న కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని, సమావేశాల ఆఖరి రోజున ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామని పేర్కొన్నారు. ధర్నా అనంతరం హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.  

షేర్ :

మరిన్ని జాతీయం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.