మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       జాతీయం న్యూస్

ఢిల్లీలో బిజెపి ప్రధాన కార్యాలయం ప్రారంభం

Updated: 18-02-2018 02:14:51

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బిజెపి కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ సేవలను, త్యాగాలను కొనియాడారు. దేశభక్తి మెండుగా ఉన్న పార్టీ బిజెపి అన్నారు. అనేక తరాల కార్యకర్తలు త్యాగాలు చేయడం వల్లే పార్టీ నేడు ఈ పరిస్థితిలో ఉందని చెప్పారు. అమిత్ షా నేతృత్వంలో పార్టీ సరైన దారిలో వెళ్తోందన్నారు. అంతకుముందు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ 11 కోట్ల మంది కార్యకర్తలు సభ్యులుగా కలిగి ఉన్న బిజెపి న్యూ ఇండియా ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీతో పాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బిజెపి అగ్రనేత అద్వానీ, ఎంపీ మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు. 

షేర్ :

మరిన్ని జాతీయం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.