రెచ్చిపోతున్న ధవన్, కోహ్లీ.. భారీ స్కోరు దిశగా భారత్
Updated:
07-02-2018 06:26:32
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న మూడో వన్డేలో భారత్ నిలకడగా ఆడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత్ ఖాతా తెరవకముందే రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ మరో ఓపెనర్ శిఖర్ ధవన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో ధవన్, కోహ్లీ ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం 25 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. కోహ్లీ 63, ధవన్ 76 పరుగులతో క్రీజులో ఉన్నారు.