పోర్ట్ ఎలిజబెత్ వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ మనదే
Updated:
14-02-2018 12:10:47
పోర్ట్ ఎలిజబెత్ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 73 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఏడు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేయగా 275 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 42.2 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌట్ అయింది. అమ్లా 71, మర్క్రమ్ 32, డివిలియర్స్ 6, మిల్లర్ 36 పరుగులు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో రోహిత్ శర్మ 115 పరుగులు చేశాడు. 10 ఫోర్లు నాలుగు సిక్సర్లతో చెలరేగి వన్డేల్లో 17వ సెంచరీ బాదేశాడు. శిఖర్ ధావన్ 34, విరాట్ కోహ్లీ 36, రహానే 8, అయ్యర్ 30, ధోనీ 13, పాండ్యా సున్నా పరుగులు చేసి అవుటయ్యారు. భువనేశ్వర్ కుమార్ 19, కుల్దీప్ యాదవ్ 2 పరుగులు చేశారు. ఆరు వన్డేల సిరీస్‌లో నేటి మ్యాచ్ గెలవడం ద్వారా భారత్ సిరీస్ సొంతం చేసుకుంది.