మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       క్రీడా వార్తలు

భువీ దెబ్బకు తోకముడిచిన సఫారీలు.. తొలి టి20లో గెలుపు మనదే!

Updated: 18-02-2018 10:50:20

జొహాన్నెస్‌బర్గ్: తొలి టి20లో భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ దెబ్బకు సఫారీలు వణికిపోయారు. వరుసగా పెవీలియన్ దారిపట్టారు. ఫలితంగా 28 పరుగుల తేడాతో పరాజయం పాలయ్యారు. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ దక్షిణాఫ్రికాకు 204 పరుగుల విజయలక్ష్యం నిర్దేశించింది. అయితే సౌతాఫ్రికా దీటుగా ఆడలేకపోయింది. భువనేశ్వర్ కుమార్ 5 వికెట్లు పాండ్యా, చహల్ చెరొక వికెట్ తీసి దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బతీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. రోహిత్ 21, శిఖర్ 72, సురేశ్ రైనా 15, విరాట్ కోహ్లీ 26, పాండే 29, మహేంద్ర సింగ్ ధోనీ 16, పాండ్యా 13 పరుగులు చేశారు.

షేర్ :

మరిన్ని క్రీడా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.