మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       క్రీడా వార్తలు

స్మిత్, వార్నర్‌లపై ఐపీఎల్‌ బ్యాన్

Updated: 28-03-2018 04:15:38

బాల్ ట్యాంపరింగ్ వివాదంలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా కన్నెర్ర చేసింది. ఏడాది పాటు నిషేధం విధించింది. అదే సమయంలో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన కేమెరాన్ బాన్‌క్రాప్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది. కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్‌లో జట్టు మొత్తం చర్చించి బాల్ టాంపరింగ్‌కు పాల్పడాలని నిర్ణయించుకున్నట్లు స్మిత్ విచారణలో తెలిపాడు. ఆస్కార్ అనే కెమెరామెన్ బాల్ ట్యాంపరింగ్ వ్యవహారాన్ని చిత్రీకరించాడు. దీంతో ఆస్ట్రేలియన్ల దుర్మర్గం బయటపడింది. మరోవైపు స్మిత్, వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం విధించడంతో భారత్ కూడా కఠినంగా వ్యవహరించింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో స్మిత్‌, వార్నర్‌లను ఆడించరాదని నిర్ణయించింది. వీరిద్దరి స్థానంలో వేరే వాళ్లను తీసుకుంటారని ఐపీఎల్ కమిషనర్ రాజీవ్ శుక్లా తెలిపారు.  భారత్ నిర్ణయాన్ని అంతా స్వాగతిస్తున్నారు.

షేర్ :

మరిన్ని క్రీడా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.