Updated: 18-03-2018 11:02:03
కొలంబో: నిదహస్ ట్రై సిరీస్ ఫైనల్‌లో భారత్ బంగ్లాదేశ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. 167 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో తడబడింది. ఆ తర్వాత రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, పాండే ఆదుకున్నారు. అయితే చివరలో దినేశ్ కార్తీక్ 8 బంతుల్లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో 29 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు. శిఖర్ ధావన్ 10, రోహిత్ శర్మ 56, కేఎల్ రాహుల్ 24, పాండే 28, శంకర్ 17 పరుగులు చేశారు. చివరి ఓవర్‌లో చివరి బంతికి ఐదు పరుగులు చేయాల్సి ఉండగా దినేశ్ కార్తీక్ సిక్సర్ కొట్టి భారత్‌ను గెలిపించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. తమిమ్ ఇక్బాల్ 15, ఫబ్బీర్ రహమాన్ 77, మహ్మదుల్లా 11 పరుగులు చేశారు. చాహల్ 3, ఉనద్కత్ 2, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశారు.
షేర్ :
తాజా వార్తలు