అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను కట్టడి చేసిన భారత బౌలర్లు
Updated:
03-02-2018 10:02:06
తౌరంగ: అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌట్ అయింది. మెర్లో 76, పరమ్ ఉప్పల్ 34, ఎడ్వర్డ్స్ 28, స్వినీ 23, మ్యాక్స్ బ్రాంట్ 14, హోల్ట్ 13, సంగ 13, సుందర్ లాండ్ 5 పరుగులు చేశారు. భారత బౌలర్లు తక్కువ పరుగులకే ఆస్ట్రేలియాను కట్టడి చేశారు. పోరెల్, శివ్‌సింగ్, నాగర్‌కోటి, రాయ్ తలా రెండు వికెట్లు తీశారు. శివం మావి ఒక వికెట్ తీశాడు. 217 పరుగుల విజయలక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది. టార్గెట్ చిన్నదే కావడంతో భారత్ గెలవడం ఖాయమని క్రీడా పండితులు చెబుతున్నారు. లీగ్స్ దశలో భారత్ ఇప్పటికే ఓ సారి ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. 217 టార్గెట్ పెద్ద లెక్కేం కాదంటున్నారు. భారత్‌ను అడ్డుకునే శక్తి ఆస్ట్రేలియాకు లేదంటున్నారు.