Updated: 10-02-2018 09:38:16
జొహాన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న నాలుగో వన్డేలో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 5, శిఖర్ ధావన్ 109, కోహ్లీ 75, ధోనీ 42(నాటౌట్), శ్రేయాజ్ 18, రహానే 8 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ తన 100వ మ్యాచ్‌లో సెంచరీ చేయడం విశేషం. వన్డేల్లో శిఖర్ ధావన్‌కిది 13వ సెంచరీ. 10 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో ధావన్ 109 పరుగులు చేశాడు. రబడ, ఎంగిడి చెరి రెండు వికెట్లు, మార్కెల్, మోరిస్ చెరొక వికెట్ తీశారు.
షేర్ :
తాజా వార్తలు