కేఎల్ రాహుల్ జాక్‌పాట్... గంభీర్‌ను సొంతం చేసుకున్న ఢిల్లీ
Updated:
27-01-2018 12:15:25
బెంగళూరు: ఐపీఎల్ వేలంలో క్రికెటర్ల వద్దకు వద్దంటే డబ్బు వచ్చి పడుతోంది. చాలామంది క్రికెటర్లు కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారు.
కేఎల్ రాహుల్‌కు 11 కోట్ల రూపాయలిచ్చి పంజాబ్ సొంతం చేసుకుంది.
యువరాజ్ సింగ్‌ను పంజాబ్ రెండు కోట్ల రూపాయలిచ్చి కొనుక్కుంది.
కరుణ్ నాయర్‌ను పంజాబ్ జట్టు 5.6 కోట్ల రూపాయలకు కొనేసుకుంది.
డేవిడ్ మిల్లర్‌ను మూడు కోట్ల రూపాయలిచ్చి పంజాబ్ నిలబెట్టుకుంది.
సాకిబుల్ హాసన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 కోట్ల రూపాయలకు, కేన్ విలియమ్సన్‌ను 3 కోట్ల రూపాయలకు కొనేసుకుంది.
మ్యాక్స్‌వెల్‌ను 9 కోట్ల రూపాయలిచ్చి ఢిల్లీ డేర్ డెవిల్స్ సొంతం చేసుకుంది.
గౌతం గంభీర్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ 2.8 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.
బ్రావోను 6.4 కోట్ల రూపాయలకు చెన్నై కొనుగోలు చేసింది.
క్రిస్ గేల్ ఇంకా అమ్ముడుపోలేదు. బరిలో మొత్తం 578 మంది ఆటగాళ్లు ఉండగా 244 అంతర్జాతీయ ఆటగాళ్లు, 332 దేశవాళీ ఆటగాళ్లు ఉన్నారు.