అశ్విన్, ధావన్ ఎంతకు అమ్ముడుపోయారంటే?
Updated:
27-01-2018 10:31:56
బెంగళూరులో జరుగుతోన్న ఐపీఎల్ వేలంలో అశ్విన్, ధావన్ భారీ ధర పలికారు. ధావన్‌ను 5.20 కోట్ల రూపాయలకు హైదరాబాద్ నిలబెట్టుకుంది. అశ్విన్‌ను 7.60 కోట్ల రూపాయలకు పంజాబ్ కొనుగోలు చేసింది. పొలార్డ్‌ను ముంబై ఇండియన్స్ 5.40 కోట్ల రూపాయలకు కొని నిలబెట్టుకుంది. బెన్ స్టోక్స్‌ను 12.50 కోట్ల రూపాయలకు, రహానేను నాలుగు కోట్ల రూపాయలకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. డుప్లెసిస్‌ను 1.6 కోట్ల రూపాయలకు చెన్నై సొంతం చేసుకుంది. క్రిస్ గేల్ ఇంకా అమ్ముడుపోలేదు. బరిలో మొత్తం 578 మంది ఆటగాళ్లు ఉండగా 244 అంతర్జాతీయ ఆటగాళ్లు, 332 దేశవాళీ ఆటగాళ్లు ఉన్నారు.