మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       క్రీడా వార్తలు

కేఎల్ రాహుల్ దూకుడుతో ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై నెగ్గిన పంజాబ్

Updated: 08-04-2018 07:49:59

మొహాలీ: ఐపీఎల్-11 పోటీల్లో భాగంగా మొహాలీలో ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. మున్రో 4, గౌతం గంభీర్ 55, అయ్యర్ 11, శంకర్ 13, పంత్ 28 పరుగులు చేశారు. ఆ తర్వాత 167 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. పంజాబ్ జట్టులో కేఎల్ రాహుల్ చెలరేగి ఆడి జట్టుకు శుభారంభం ఇచ్చాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు. 14 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధసెంచరీ సాధించాడు. అగర్వాల్ 7, యువరాజ్ సింగ్ 12, కేకే నాయర్ 50, మిల్లర్ 24 పరుగులు చేశారు.

షేర్ :

మరిన్ని క్రీడా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.