మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       క్రీడా వార్తలు

శిఖర్ పోరాటం వృధా.. కొలంబో టి20లో శ్రీలంక విజయం

Updated: 06-03-2018 10:34:14

కొలంబో: తొలి టి20లో శ్రీలంక ఘన విజయం సాధించింది. 9 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 175 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆరంభం నుంచే జాగ్రత్తగా ఆడింది. గుణవర్ధనే 19, మెండిస్ 11, పెరీరా 66, చండిమల్ 14, తరంగా 17, షనక 15 పరుగులు చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 49 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఆరు ఫోర్లతో చెలరేగి 90 పరుగులు చేసినా లాభం లేకుండా పోయింది. శర్మ డకౌట్ అయ్యాడు. రైనా ఒక పరుగుకే వెనుదిరిగాడు. పాండే 37, పంత్ 23, కార్తీక్ 13 పరుగులు చేశారు.  

షేర్ :

మరిన్ని క్రీడా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.