మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       క్రీడా వార్తలు

సెంచరీతో కదం తొక్కిన కోహ్లీ.. తొలి వన్డే నెగ్గిన భారత్

Updated: 02-02-2018 12:46:29

డర్బన్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 270 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో రెండు వికెట్లు కోల్పోయినా జాగ్రత్తగా ఆడింది. కెప్టెన్ కోహ్లీ, అజింక్యా రహానే బాధ్యతాయుతంగా ఆడి జట్టును గెలిపించారు. కోహ్లీ సెంచరీతో కదం తొక్కాడు. 119 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో కోహ్లీ 112 పరుగులు చేశాడు. వన్డేల్లో కోహ్లీకిది 33వ సెంచరీ. ఆరు వన్డేల సిరీస్‌లో భారత్ తొలి వన్డేను గెలుచుకుని దక్షిణాఫ్రికాకు సవాలు విసిరింది. వాస్తవానికి ఈ స్టేడియంలో భారత్ ఏ మ్యాచ్‌నూ గతంలో గెలవలేదు. అయితే తొలి వన్డేలో ఆతిధ్య దేశాన్ని చిత్తు చేయడం ద్వారా తమను తక్కువ అంచనా వేయవద్దని కోహ్లీ సేన గట్టి హెచ్చరిక చేసినట్లైంది. 112 పరుగులు చేసిన కోహ్లీని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపిక చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. డు ప్లెసిస్ 120 పరుగులు చేశాడు. కుల్దీప్ యాదవ్ 3, చహల్ 2, బుమ్రా, భువనేశ్వర్ కుమార్ చెరొక వికెట్ తీశారు. భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ 20, శిఖర్ ధావన్ 35, రోహ్లీ 112, రహానే 79, పాండ్యా 3, ధోనీ 4 పరుగులు చేశారు. 

షేర్ :

మరిన్ని క్రీడా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.