బోణీ కొట్టిన భారత్
Updated:
09-03-2018 07:45:56
కొలంబో: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన టి20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 140 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18వ ఓవర్‌లోనే లక్ష్యాన్ని చేధించింది. నాలుగు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. విజయంలో శిఖర్ ధవన్ కీలక పాత్ర పోషించాడు. 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగి ఆడి 55 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 17, రిషబ్ పంత్ 7, సురేశ్ రైనా 28, మనీష్ పాండే 27, దినేశ్ కార్తీక్ 2 పరుగులు చేశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు సాధించింది. తమీమ్ ఇక్బాల్ 15, సౌమ్యా సర్కార్ 14, లిటోన్ దాస్ 34, ముష్ఫికర్ రహీమ్ 18, షబ్బిర్ రహమాన్ 30 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఉనద్కత్ 3 వికెట్లు, విజయ్ శంకర్ రెండు, చహల్ ఠాకూర్ చెరొక వికెట్ తీశారు.