రోడ్డు ప్రమాదంలో మహ్మద్ షమీకి గాయాలు
Updated:
25-03-2018 12:24:37
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో మహ్మద్ షమీ గాయపడ్డారు. ఆయన తలకు బలమైన గాయాలయ్యాయి. కుట్లు కూడా పడ్డాయి. డెహ్రాడూన్ నుంచి న్యూఢిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జయింది.
మరోవైపు కొద్ది రోజులుగా మహ్మద్ షమీ వివాదాల్లో చిక్కుకున్నారు. గృహ హింస, వివాహేతర సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆయన భార్య హసీన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమబెంగాల్ మమతా బెనర్జీని కూడా కలిసి ఫిర్యాదు చేశారు. ఐపీఎల్ వేళ 15 రోజులుగా షమీ మానసికంగా ఆందోళనలో ఉన్నారు.
మహ్మద్ షమీ గాయపడ్డారనే వార్తతో ఆయన ఫ్యాన్స్ షాక్‌లో ఉన్నారు. త్వరగా కోలుకోవాలని, అన్ని వివాదాల నుంచి ఆయన త్వరగా బయటపడాలని అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు.