టీమిండియా ఆటగాళ్లకు శుభవార్త.. భారీగా పెరగనున్న వేతనాలు
Updated:
28-02-2018 03:19:01
న్యూఢిల్లీ: టీమిండియయా ఆటగాళ్లకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఆటగాళ్లందరికీ జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఆటగాళ్లను ఏ, ఏ ప్లస్, బిగా విభజించింది. టెస్టు, వన్డే, టీ20.. మూడు ఫార్మాట్లలోనూ ఆడే ఆటగాళ్లకు ఏ ప్లస్ కేటగిరీలో చేర్చనున్నట్టు సమాచారం. దీని ప్రకారం కోహ్లీ, ధవన్, రోహిత్ శర్మ, పాండ్యా, భువనేశ్వర్ కుమార్ తదితరులకు భారీగా వేతనాలు పెరిగే అవకాశం ఉంది.
శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు టోర్నీకి భారత జట్టు మార్చి 3న శ్రీలంక బయలుదేరనుంది. అంతకుముందే బీసీసీఈ ఈ నిర్ణయాన్ని ప్రకటించున్న్టటు తెలుస్తోంది. ముంబైలో జరిగిన సమావేశంలో ఆటగాళ్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఆటగాళ్ల వేతనాలు పెంచాలని కోరుతూ గతేడాది బీసీసీఐతో కోహ్లీ, ధోనీ, రవిశాస్త్రి చర్చలు జరిపారు.