10 ఫోర్లు 4 సిక్సర్లతో చెలరేగిన రోహిత్ శర్మ... 17వ సెంచరీ నమోదు
Updated:
13-02-2018 07:22:36
పోర్ట్ ఎలిజబెత్ వన్డేలో రోహిత్ శర్మ చెలరేగాడు. 107 బంతుల్లో 100 పరుగులు చేశాడు. 10 ఫోర్లు నాలుగు సిక్సర్లతో చెలరేగి వన్డేల్లో 17వ సెంచరీ బాదేశాడు. శిఖర్ ధావన్ 34, విరాట్ కోహ్లీ 36, రహానే 8 పరుగులు చేసి అవుటయ్యారు. అయ్యర్, రోహిత్ క్రీజులో ఉన్నారు. స్కోరుబోర్డును పరుగులెత్తిస్తున్నారు. ఆరు వన్డేల సిరీస్‌లో ఇది ఐదోది. భారత్ ఇప్పటికే మూడు వన్డేలు గెలిచింది. ఆతిథ్య దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్ గెలిచింది. నేటి మ్యాచ్ గెలిస్తే సిరీస్ భారత్ సొంతమవుతుంది. కీలకమైన మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ కొట్టడంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. వివిఎస్ లక్ష్మణ్, సురేశ్ రైనా తదితరులు ట్విటర్ వేదికగా ప్రశంసించారు.