మళ్లీ విఫలమైన రోహిత్ శర్మ.. మూడో వన్డేలో డకౌట్
Updated:
07-02-2018 04:48:04
కేప్‌టౌన్: ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. రబడా వేసిన తొలి ఓవర్ చివరి బంతికి క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చిన రోహిత్ డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. ఆరు వన్డేల సిరీస్‌లో భారత్ తొలి రెండు వన్డేలను గెలిచి సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించింది.