మనీష్ పాండేపై కనకవర్షం.. కేదార్ జాదవ్ దశ తిరిగింది..
Updated:
27-01-2018 01:03:46
బెంగళూరు: ఐపీఎల్ 2018లో క్రికెటర్లపై కనకవర్షం కురుస్తోంది. మనీష్ పాండేకు లక్ష్మీ కటాక్షం లభించింది. పాండేను 11 కోట్ల రూపాయలిచ్చి హైదరాబాద్ కొనుక్కుంది.
క్రిస్ లిన్‌ను 9.6 కోట్ల రూపాయలకు కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసుకుంది.
ఆరోన్ ఫించ్‌ను 6.2 కోట్ల రూపాయలకు పంజాబ్ కొనేసుకుంది.
మెక్ కల్లమ్‌ను 3.5 కోట్ల రూపాయలకు ఆర్‌సిబి కొనుగోలు చేసింది.
వాట్సన్‌ను చెన్నై 4 కోట్ల రూపాయలిచ్చి కొనేసుకుంది.
యూసుఫ్ పఠాన్‌ను కోటి 90లక్షలిచ్చి హైదరాబాద్ కొనుక్కుంది. ఇటీవలే యూసుఫ్ పఠాన్‌పై నిషేధం తొలగిపోయింది.
కేదార్ జాదవ్‌ను 7.8 కోట్ల రూపాయలిచ్చి చెన్నై సొంతం చేసుకుంది.
బరిలో మొత్తం 578 మంది ఆటగాళ్లు ఉండగా 244
అంతర్జాతీయ ఆటగాళ్లు, 332 దేశవాళీ ఆటగాళ్లు ఉన్నారు.