మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       క్రీడా వార్తలు

తనను కలవడానికి వచ్చిన భార్యకు వార్నింగ్ ఇచ్చిన షమీ

Updated: 27-03-2018 06:57:14

న్యూఢిల్లీ: డెహ్రాడూన్ నుంచి న్యూఢిల్లీ వెళ్తుండగా ప్రమాదానికి గురై గాయాలపాలైన షమీని పరామర్శించేందుకు ఆయన భార్య హసిన్ జహాన్ ఆసుపత్రికి వెళ్లింది. అయితే తనను కలవొద్దని షమీ వార్నింగ్ ఇచ్చారు. కోర్టులో చూసుకుందామని చెప్పారు. దీంతో ఆమె షమీని కలవకుండానే వెనుదిరిగారు. అయితే తన కుమార్తెతో మాత్రం షమీ కాసేపు ఆడుకున్నారు. అయితే ఆయన భార్యతో మాట్లాడేందుకు మాత్రం ఆసక్తి చూపలేదు. వాస్తవానికి గృహ హింస, వివాహేతర సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో షమీ భార్య హసీన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో షమీ మానసిక ఆందోళనకు గురయ్యాడు. ఇదే క్రమంలో డెహ్రాడూన్ నుంచి న్యూఢిల్లీ వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. ఆయన ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జయింది. గాయపడ్డ షమీ కోలుకోవాలని ఆయన భార్య హసీన్ జహాన్ అల్లాను ప్రార్ధిస్తున్నట్లు చెప్పారు. షమీ తనకు శతృవేమీ కాదన్నారు. షమీ త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. దీంతో వీరిద్దరి మధ్య సమస్యలు పరిష్కారమౌతాయని అంతా ఆశించారు. అయితే హసీన్ జహాన్‌ను కలిసేందుకు షమీ తిరస్కరించడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది.  

షేర్ :

మరిన్ని క్రీడా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.