టి20లో దుమ్మురేపిన భారత్.. సిరీస్ మనదే
Updated:
25-02-2018 12:52:42
కేప్‌టౌన్: ఆఖరు టి20లో టీం ఇండియా దుమ్మురేపింది. ఏడు పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 11, ధావన్ 47, రైనా 43, పాండే 13, పాండ్యా 21, ధోనీ 12, కార్తీక్ 13, పటేల్ 1, భువనేశ్వర్ కుమార్ 3 పరుగులు చేశారు. 173 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిధ్య సౌతాఫ్రికా దీటుగా ఆడలేకపోయింది. 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. అటు భారత మహిళల జట్టు కూడా సౌతాఫ్రికాపై టి20 సిరీస్ గెలుచుకుంది.