శాంసంగ్ ఫోన్‌పై రూ.8వేల క్యాష్ బ్యాక్.. అమెజాన్ బంపరాఫర్
Updated:
05-03-2018 07:28:37
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియా బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. నేటి నుంచి ఈనెల 8 వరకు నాలుగు రోజులపాటు నిర్వహించనున్న ‘శాంసంగ్ కార్నివాల్ సేల్’లో భాగంగా ఎంపిక చేసిన శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై రూ.8 వేల వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్టు తెలిపింది. క్యాష్ బ్యాక్ అమెజాన్ పే రూపంలో వినియోగదారులకు లభిస్తుంది. గెలాక్సీ ఎ సిరీస్, గెలాక్సీ ఆన్ సిరీస్, గెలాక్సీ నోట్ సిరీస్ ఫోన్లకు ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుందని అమెజాన్ పేర్కొంది. దీంతోపాటు శాంసంగ్ టెలివిజన్, హోం అప్లయెన్సెస్, ట్యాబ్లెట్స్, స్టోరేజీ గాడ్జెట్లపైనా రాయితీలు అందిస్తోంది. ఇటువంటి ఆఫర్‌నే పేటీఎం మాల్ ద్వారా కూడా పొందవచ్చు. ఎంపిక చేసిన శాంసంగ్ ఫోన్లపై పేటీఎం మాల్ ఏకంగా రూ.10 వేల వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. మరిన్ని వివరాల కోసం శాంసంగ్ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.