మరో రూ.200 పడిపోయిన పసిడి ధర
Updated:
23-10-2017 09:43:12
ముంబై: బంగారం ధర మరోమారు పతనమైంది. సోమవారం నాటి ట్రేడింగ్‌లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.200 తగ్గి రూ.30,450కి చేరుకుంది. అంతర్జాతీయ పరిస్థితులతోపాటు స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో ధర నేల చూపులు చూసినట్టు బులియన్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర కిలోకు రూ.50 పెరిగి రూ.40,900కు చేరుకుంది.